News January 31, 2025
స్నేహం ఎంతో విలువైనది – నటుడు సుమన్

స్నేహం ఎంతో విలువైనదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. పలు కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం రాజమండ్రి ఏవీ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్‌లో తన మిత్రులను కలిశారు. సుమన్‌కు 20 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న షేక్ మీరా బాబ్జి, షేక్ సుభాన్ తదితరులు ఆయనను సత్కరించారు. తన జీవితంలో సంపాదించిన ఆస్తి స్నేహం, అభిమానమేనని సుమన్ పేర్కొన్నారు.
Similar News
News February 10, 2025
అనపర్తిలో పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య

అనపర్తిలో ఓ యువకుడు పెళ్లైన ఏడాదికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI శ్రీను తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన సాయి సాకేత్‌రెడ్డి కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు. శనివారం పురుగుమందు తాగగా.. బంధువులు రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.
News February 10, 2025
ఫ్లైట్ డోర్ తెరిచిన రాజమండ్రి ప్రయాణికుడు

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కోరుకొండ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం శనివారం రాత్రి మధురపూడి విమానాశ్రయానికి వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత రాజమండ్రికి చెందిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానం వెళ్లడానికి జాప్యం జరిగింది.
News February 10, 2025
తూ.గో: నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

తూ.గో.జిల్లాలో సోమవారం నుంచి 14వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్ ఆర్‌ఐవో నరసింహం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 77 సెంటర్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి విడత ఈ నెల 10, 11, 12, 13, 14 తేదీల్లో 58 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఆయా సెంటర్లలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందన్నారు. పరీక్షల పర్యవేక్షణకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు.