News June 24, 2024

స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఆత్మహత్య

image

మద్యం తాగే క్రమంలో స్నేహితుడితో గొడవపడి చెరువులో దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేకున్నాడు. ఈ ఘటన చేగుంట మండల కేంద్రంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చేగుంటకు చెందిన తిరుపతి, సాయికుమార్(21) ఆదివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తూ స్నేహితుడిపై దాడి చేశాడు. ఆ క్రమంలో స్నేహితుడు గాయడగా భయపడిన సాయికుమార్ స్థానిక ఊర చెరువులో దూకి ఆత్మహత్య చేకున్నాడు. మృతుడి తలిదండ్రులు గతంలోనే మృతి చెందారు.

Similar News

News November 20, 2025

మెదక్: ‘దివ్యాంగులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలి’

image

జిల్లాలో ఎంపికైన దివ్యాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక సభ్యులు విజ్ఞప్తి చేశారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. సహాయ పరికరాలు పంపిణీ కోసం గతంలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందని, 7920 మంది లబ్ధిదారులు 16 రకాల పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. వెంటనే ప్రభుత్వం సహాయ పరికరాలు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

News November 20, 2025

మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

image

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్‌లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News November 20, 2025

నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

image

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్‌ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.