News July 12, 2024

స్నేహితులే హంతకులు: నెల్లూరు DSP

image

కోవూరు రాళ్లమిట్టలో ఈ నెల 9న యువకుడి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఘటనపై వివరాలను గురువారం డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి వెల్లడించారు. బాధితుడు నాగరాజు అతడి స్నేహితులు ఓ పందిని దొంగిలించిన ఘటనలో యజమాని రామకృష్ణతో గొడవడ్డారు. ఈ గొడవలో అనూహ్యంగా మరో స్నేహితుడు నాగరాజును పొడవడంతో అతడు చనిపోయాడు. ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరికొందరు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.

Similar News

News November 4, 2025

తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

News November 4, 2025

అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ

image

విజయవాడలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ అందజేయనున్నట్లు జిల్లా సంబంధిత శాఖ సమన్వయ అధికారిణి డాక్టర్ సి. ప్రభావతమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

News November 4, 2025

నెల్లూరు: సగం బిల్లే ఇచ్చారని TDP నాయకుడి ఆవేదన

image

గుడ్లూరు(M) చినలాటరపికి చెందిన TDP నాయకుడు మల్లికార్జున ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం హల్‌చల్ చేశారు. 2014-19 మధ్య చేసిన పనులకు రూ.10 లక్షల బిల్లులు ఆగిపోయాయని, తాజాగా రూ.3.5 లక్షలే విడుదల చేశారని చెప్పారు. మిగిలినవి ఇవ్వకపోతే పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాధాన్యక్రమంలో బిల్లులు చెల్లిస్తామని MPDO తెలిపారు.