News June 11, 2024

స్నేహితుల మధ్య వివాదమే హత్యకు కారణం

image

మద్యం మత్తులో స్నేహితుల మధ్య చోటు చేసుకున్న <<13412715>>వివాదమే<<>> దారుణ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తెలిపారు. ఊర్వశి జంక్షన్ నలంద నగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు అని హేమంత్ కుమార్, సాయికిరణ్, అభిషేక్, హరీశ్, ఉదయ్ కలిసి బయటికి వెళ్లారు. మద్యం తాగిన అనంతరం వీరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో హేమంత్ ఉదయ్ మెడపై కత్తితో పొడవగా అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకున్నారు.

Similar News

News November 18, 2025

రేపే దీపోత్సవం.. ఏర్పాట్లు పూర్తి

image

పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీఅనంతపద్మనాభ స్వామి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు సాయంత్రం 5:30లకు జైగంట మోగగానే మెట్లకి ఇరువైపులా దీపాలు వెలిగించే కార్యక్రమం మొదలవుతుంది. ఆ సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలి.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న బాలకృష్ణ

image

సింహాచలం దేవస్థానంలో అప్పన్న స్వామిని సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం సింహాచలం వచ్చిన బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీనుని ఏఈవో తిరుమల ఈశ్వరరావు, వేద పండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం అఖండ-2 సినిమా సాంగ్‌ను విడుదల చేయనున్నారు.