News February 27, 2026
స్నేహ శబరీష్.. పాలనలో తనదైన ముద్ర!

HNK కలెక్టర్‌గా జూన్ 2025లో బాధ్యతలు చేపట్టిన స్నేహ శబరీష్ సుమారు 8 నెలల పాటు జిల్లాలో సేవలందించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరిస్తూ పాలనలో తనదైన ముద్ర వేశారు. తరచూ ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేశారు. మిషన్ ఎక్సలెన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రభుత్వ & గురుకుల విద్యార్థులు JEE, IIT సాధించేలా తన వంతు ప్రయత్నం చేశారు.
Similar News
News April 12, 2026
తిరుమలలో ఇలా చేయకండి..!

తిరుమల మాడ వీధిలోని తాగునీటి కుళాయి వద్ద ఓ వ్యక్తి షేవింగ్ చేసుకున్నాడు. భక్తులకు అందుబాటులో ఉంచిన తాగునీటిని ఇలా ఇతర అవసరాలకు వినియోగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు, స్థానికులు తిరిగే ప్రదేశాల్లో పరిశుభ్రత, నియమాలు పాటించాలని కోరుతున్నారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. 13వ స్థానంలో నిర్మల్

ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదలయ్యాయి. నిర్మల్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 5,291 మంది పరీక్షలు రాయగా 3,885 మంది పాసై 73.43% ఉత్తీర్ణతతో 13వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 858 మందికి 620 మంది పాసై 72.26శాతంతో 22వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 287 మందికి 110 మంది పాసై 38.33%తో 5వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 36 మందికి 22 మంది పాసై 61.11 %తో 8వప్లేస్ వచ్చింది.
News April 12, 2026
నల్గొండ: వరికోతలు షురూ.. ఈ విషయంలో జాగ్రత్త

సాగర్ ఆయకట్టు పరిధిలో వరి కోతలు ముమ్మరమయ్యాయి. అయితే పొలాల్లో <<19627772>>విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో<<>> ఉండటంతో హార్వెస్టర్ల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తాజాగా మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో కోత యంత్రం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందడం విషాదం నింపింది. రైతులు, డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి, విద్యుత్ లైన్లను గమనిస్తూ కోతలు చేపట్టాలని అధికారులు సూచిస్తున్నారు.


