News April 2, 2025
స్పాట్ వాల్యుయేషన్కు 683మంది: అల్లూరి DEO

అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో తలార్ సింగ్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి పదో తరగతి పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. పాడేరులో స్పాట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. 75 మంది చీఫ్ ఎక్సమినర్స్, 450మంది అసిస్టెంట్ ఎక్సమినర్స్, 150మంది స్పెషల్ అసిస్టెంట్స్తో పాటు మొత్తం 683 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.
Similar News
News April 8, 2025
పవన్ కుమారుడికి ప్రమాదం.. స్పందించిన YS జగన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ <<16028483>>అగ్నిప్రమాదంలో <<>>గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాకయ్యా. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని జగన్ Xలో రాసుకొచ్చారు.
News April 8, 2025
వెదురుకుప్పం: స్వగ్రామానికి మిస్ గ్లోబల్ ఏషియన్ విజేత

వెదురుకుప్పం మండలం పాతగుంట టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ గోపికృష్ణరెడ్డి కుమార్తె భావన మిస్ గ్లోబల్ ఏషియన్-2025గా నిలిచింది. ఈక్రమంలో ఆమె పాతగుంటకు మంగళవారం చేరుకున్నారు. గ్రామస్థులు ఆమెకు ఆహ్వానం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చంద్రబాబు రెడ్డి, లోకనాథ రెడ్డి, తిమ్మరాజులు, హేమ శేఖర్, ఎమ్మెస్ రెడ్డి పాల్గొన్నారు.
News April 8, 2025
ఇవాళ ఈ వ్రతం చేస్తే వైవాహిక సమస్యలుండవు!

ఇవాళ ‘కామదా ఏకాదశి’. ఈరోజు వివాహితులు లక్ష్మీ నారాయణులను ఆరాధిస్తే మంచిదని పురోహితులు చెబుతున్నారు. అలాగే విధిగా ‘కామదా ఏకాదశి వ్రతం’ చేస్తే పాపాలు పోవడం, వైవాహిక సమస్యలు తొలగడం తథ్యమని సూచిస్తున్నారు. శాపం కారణంగా ఓ గంధర్వుడు రాక్షసుడి రూపంలో జీవితం కొనసాగిస్తే, అతని భార్య ఈ వ్రతం చేయడంతో శాపం తొలగిపోతుంది. భార్యాభర్తలు విడిపోకుండా చూసే శక్తి ఈ వ్రతానికి ఉందని వివరిస్తున్నారు.