News August 9, 2024
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు వనదేవతల ప్రతిమ అందజేత
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారమ్మ ప్రధాన పూజారి జగ్గారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారలమ్మ వనదేవతల ప్రతిమల జ్ఞాపికను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సారలమ్మ పూజారి కాక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 11, 2024
వరంగల్ మీదుగా 12 స్పెషల్ రైళ్లు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వరంగల్ మీదుగా అక్టోబర్ 16 నుంచి 20 వరకు అప్ అండ్ డౌన్ రూట్లో 12 రైళ్ల సర్వీసులను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జబల్పూర్, ఇటార్సీ, నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, వరంగల్, ఖమ్మం, విజయవాడ, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రైల్వే స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు చెప్పారు.
News September 11, 2024
సాంఘిక సంక్షేమ గురుకులలో స్పాట్ అడ్మిషన్లు
వరంగల్ రీజియన్ పరిధిలోని ములుగు, హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించనున్నట్లు జిల్లా కో-ఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు మడికొండలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలకు హాజరు కావాలన్నారు.
News September 11, 2024
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు వరంగల్, హనుమకొండ డీఐఈవోలు ఎ.గోపాల్, డా.సుమన్ శ్రీధర్ తెలిపారు. బోర్డు నిర్దేశించిన ప్రవేశాల గడువు ఈ నెల 7తో ముగియగా ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 15 వరకు ప్రవేశాలకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు అధికార వర్గాలు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.