News June 13, 2024

స్పెషల్ గెటప్‌లో విశాఖ సీపీ

image

గంగవరం పోర్ట్ నిర్వాసితుల కార్మికుల బడాఖానా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్మికులు పోలీస్ కమిషనర్‌కు చక్కటి సన్మానం చేశారు. మత్స్యకారుడి వేషంలో ఒక చేత్తో వల, మరో చేతితో చేప, భుజం మీద బ్యాగు, నెత్తి మీద టోపీతో పోలీస్ కమిషనర్ రవిశంకర్ వినూత్నంగా కనిపించారు.

Similar News

News October 26, 2025

విశాఖ: ఆర్టీసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పరిశీలించిన రీజనల్ మేనేజర్

image

ఆర్టీసీ విశాఖ జిల్లా రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం ఆర్టీసీ బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పరిశీలించారు. విశాఖ నుంచి బయలుదేరే ఏసీ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డ్రైవర్లు, కండక్టర్లకు బస్సుల్లో ఏటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన కల్పించారు. ఎమర్జెన్సీ డోర్స్‌ను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.

News October 26, 2025

విశాఖలో పాఠశాలలు, కళాశాలలకు 2 రోజుల సెలవు

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 2 రోజులపాటు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. 27, 28వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్ని పాఠశాలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News October 26, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

image

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.