News January 27, 2025

స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ అవార్డు

image

మడకశిర స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రాయప్ప ఉత్తమ అవార్డును అందుకున్నారు. అత్యుత్తమ పనితీరు ప్రదర్శించినందుకు రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని ఆదివారం అందుకున్నారు.

Similar News

News February 28, 2026

NGKL: అంతుచిక్కని కుమ్మెర ఘటన

image

కుమ్మెర ఘటన రోజురోజుకూ అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నారు. బాధితుల పట్ల పోలీసుల వైఖరిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న కాంగ్రెస్ నేతల బృందం గ్రామంలో పర్యటించింది. ఘటనపై NHRC సీరియస్‌ అయింది. అనేక మలుపులతో అంతుచిక్కని ఈ కేసు చివరకు ఎటువైపు దారితీస్తుందో చూడాలి మరి.

News February 28, 2026

రాష్ట్రంలో ఖమ్మం ఫస్ట్.. 30వ స్థానంలో భద్రాద్రి

image

ఖమ్మం జిల్లా రాష్ట్రంలో రైతు రిజిస్ట్రీలో తొలి స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 75.21% మంది రైతులు వివరాలు నమోదు చేసుకోగా, వారం రోజుల్లో 100% పూర్తి చేయాలని లక్ష్యంగా వ్యవసాయశాఖ కృషి చేస్తోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 53.15% మాత్రమే నమోదై రాష్ట్రంలో 30వ స్థానంలో ఉంది. పీఎం కిసాన్ సహా కేంద్ర పథకాల లబ్ధికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు సూచించారు.

News February 28, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కు చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,900 ఎగబాకి రూ.1,51,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.5వేలు పెరిగి రూ.3,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.