News December 4, 2024
స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2024లో సక్తా చాటిన కర్నూలు విద్యార్థులు

స్మార్ట్ ఇండియా హ్యాక్ థాన్-2024లో భాగంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీల ఫైనల్స్‌లో కర్నూలులోని ఓ మహిళా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. జాతీయస్థాయి పోటీలు ఈనెల 11 నుంచి ఎన్ఐటీ శ్రీనగర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. జాతీయ స్థాయి పోటీల్లో దేశవ్యాప్తంగా 57,378 ఐడియాలను ఆన్లైన్లో సబ్మిట్ చేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్నారు.
Similar News
News January 21, 2026
కర్నూలు: ఊ అంటుందా. ఊఊ అంటుందా?

ఆదోని జిల్లా కోసం పట్టణంలో భారీగా నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలైన పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మిగనూరులో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో ఈనెల 24న ఆ 5 నియోజకవర్గాల్లో బంద్‌కు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ బంద్ తర్వాతైనా ప్రభుత్వం ప్రత్యేక జిల్లాకు ఊ కొడుతుందా లేక ఊఊ అంటుందా చూడాలి.
News January 21, 2026
కర్నూలు: ఎయిడెడ్ పోస్టుల భర్తీకి పరీక్షా షెడ్యూల్ విడుదల

కర్నూలు జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి డీఈవో సుధాకర్ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. దుపాడులోని డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి విద్యాసంస్థల్లో ఈనెల 27 నుంచి 31 వరకు పరీక్షలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News January 21, 2026
ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: కలెక్టర్

కర్నూలు జిల్లాలోని రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పంటలో రైతులకు అధిక దిగుబడి, లాభాలు వచ్చేలా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.ఈ సమావేశంలో అగ్రికల్చర్ ఆఫీసర్ వరలక్ష్మి పాల్గొన్నారు.


