News September 24, 2024
‘స్వచ్చతా-హీ-సేవా’ కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
‘స్వచ్చతా-హీ-సేవా’ కార్యక్రమాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సచివాలయంలో రివ్యూ అనంతరం మంత్రి మాట్లాడుతూ… అధికారులంతా జవాబుదారిగా వ్యవహరించాలని కోరారు. జిల్లాల్లో ప్రతి రోజు చేపట్టిన కార్యక్రమాల వివరాలను అన్ లైన్ లో ఎంట్రీ చేయాలని సీతక్క సూచించారు.
Similar News
News October 3, 2024
వరంగల్: నేడు ఎస్జీటీ అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన
వరంగల్ జిల్లా ఎస్జీటీ 1:3 నిష్పత్తిలో భాగంగా గురువారం 271 నుంచి 435 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్ పరిశీలన ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. నిన్న సర్టిఫికెట్ పరిశీలనకు రాని అభ్యర్థులు.. ఈరోజు కూడా అటెండ్ అవ్వవచ్చన్నారు. అభ్యర్థులు వచ్చే ముందు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సంబంధిత గెజిటెడ్ సంతకంతో సర్టిఫికెట్లన్నీ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని అన్నారు.
News October 3, 2024
ములుగు: పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి
పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. శంకరాజుపల్లి గ్రామానికి చెందిన సుమన్, మానస దంపతుల కుమారుడు గగన్(3) చిన్నబోయినపల్లిలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. గమనించిన కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం తరలించగా పరిస్థితి విషమించి నేడు మృతి చెందాడు.
News October 3, 2024
జనసంద్రమైన వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు
HNK జిల్లా కేంద్రంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల సందర్భంగా వేయి స్తంభాల ఆలయ పరిసర ప్రాంతాలు జనసంద్రమయ్యాయి. హనుమకొండ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో దేవాలయానికి తరలివచ్చి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ వేడుకల సందర్భంగా మహిళలు, భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టారు.