News August 3, 2024
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఆమ్రపాలి

ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Similar News
News October 28, 2025
HYD: రూ.168 కోట్లతో హైడ్రాలాజికల్ సెంటర్

HYDలో దాదాపు రూ.168 కోట్లతో నేషనల్ హైడ్రాలాజికల్ ప్రాజెక్టు కింద స్టేట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించి ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డ్స్ ఏర్పాటు, జలాశయాల్లో పూడికతీత, సర్వేల నిర్వహణ, ప్రాజెక్టుల వద్ద సిస్టం ఏర్పాటు యంత్ర సమీకరణ తదితర వాటిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. దీనికి మొత్తం కేంద్రమే నిధులు అందించనుంది.
News October 28, 2025
HYD: పోస్ట్ ఆఫీసుల్లో రాత్రి 9 వరకు ఆధార్ సేవలు

HYDలోని జనరల్ పోస్ట్ ఆఫీసుల్లో ఆధార్ సేవా కేంద్రాలు ఉ.8 నుంచి రాత్రి 9 గం. వరకు పనిచేస్తున్నట్లు చీఫ్ పోస్ట్ మాస్టర్ వై.ప్రసాద్ తెలిపారు. ఆధార్ అనుసంధానం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిందన్నారు. పేరు, ఇంటి పేరు, చిరునామా, మొబైల్ నంబర్ సవరణల కోసం ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా దగ్గర్లోని పోస్ట్ ఆఫీసులో సంప్రదించండి. SHARE IT
News October 28, 2025
HYD: మావోయిస్ట్ పార్టీ కీలక సభ్యుడు ప్రకాశ్ లోంగుబాటు

మావోయిస్ట్ పార్టీలో తెలంగాణ నుంచి కీలక వ్యక్తి బండి ప్రకాశ్ లొంగిపోయారు. ఆ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా గతంలో ఆయన పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియాలో ఈయన కీలక ఆర్గనైజర్గా తెలుస్తోంది. 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిల్లో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ @ ప్రభాత్ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు.


