News August 3, 2024
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: ఆమ్రపాలి

ఈనెల 5 నుంచి 9 వరకు నిర్వహించనున్న ‘స్వచ్ఛదనం- పచ్చదనం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశుధ్యం, పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై కమిషనర్ శుక్రవారం జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.
Similar News
News December 9, 2025
తెలంగాణలో సల్మాన్ ఖాన్ వెంచర్స్

సల్మాన్ ఖాన్ వెంచర్స్ తెలంగాణలో రూ.10,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్, ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయనుంది. తెలంగాణ రైజింగ్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రకటనలలో ఇది ఒకటి. ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను ఆవిష్కరించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ లగ్జరీ హాస్పిటాలిటీ, అనుభవపూర్వక విశ్రాంతి, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తి స్థాయి ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను మిళితం చేస్తుంది.
News December 9, 2025
HYD: సిటీలో నీటిని తోడేస్తున్నారు!

మహానగరంలో భూగర్భజలాలను యథేచ్ఛగా వాడేస్తున్నారు. వాడాల్సిన నీటి కంటే ఎక్కువ తోడుతూ భూగర్భాన్ని ఖాళీ చేస్తున్నారు. భూమిలో ఇంకే నీటి కంటే వాడేనీరే అధికంగా ఉంటోంది. సరూర్‌నగర్, శేరిలింగంపల్లి, చార్మినార్, గోల్కొండ, అంబర్‌పేట, ఖైరతాబాద్, అసిఫ్‌నగర్, హిమాయత్‌నగర్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాడకం మరీ ఎక్కువగా ఉందని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ తేల్చింది.
News December 9, 2025
HYD: ఇపుడు 69.. తర్వాత 152.. ఫ్యూచర్‌లో 400 KM!

గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపాలిటీల విలీనం తరువాత విస్తీర్ణం భారీగా పెరిగింది. దీంతో రవాణా అవసరాలు కూడా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరంలో మెట్రో రైలును కూడా మహానగర వ్యాప్తంగా విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 69 కిలోమీటర్ల నెట్ వర్క్ ఉన్న మెట్రో రెండో దశలో మరో 152 KM పెరిగే అవకాశముంది. 2047 నాటికి మెట్రోను 400 KM పెంచి 623 KMకు విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తోంది.


