News August 6, 2024

స్వచ్ఛదనం-పచ్చదనం విజయవంతం చేయాలి: ఆర్.వి.కర్ణన్

image

స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి ఆర్.వి.కర్ణన్ సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తాగునీటి సరఫరా, డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు.

Similar News

News April 19, 2026

జమ్మికుంట: జిల్లా పద్మశాలి మహిళా అధ్యక్షురాలిగా కందికట్ల పద్మ

image

తెలంగాణ రాష్ట్ర పద్మశాలి చేనేత ఐక్య వేదిక కరీంనగర్ జిల్లా పద్మశాలి సంఘం మహిళా విభాగ నూతన అధ్యక్షురాలిగా జమ్మికుంటకు చెందిన కందికట్ల పద్మను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పద్మ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన సంఘ పెద్దలు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. పద్మశాలీల సంక్షేమం, ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.

News April 18, 2026

KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

image

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.