News February 15, 2025
స్వచ్ఛ్ ఆంధ్రలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యసాధనలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేకంగా ఓ థీమ్ తీసుకొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వాటిలో 105 పాయింట్లతో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.
Similar News
News November 24, 2025
పెద్దపల్లి డీఈఓగా శారదకు అదనపు బాధ్యతలు

పెద్దపల్లి డీఈఓ డి.మాధవి సెలవుపై వెళ్లడంతో డీఈఓ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న జీ.శారదకు అదనపు డీఈఓ బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యా సంచాలకులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మాధవి నవంబర్ 7న సెలవు దరఖాస్తు సమర్పించడంతో ఖాళీ ఏర్పడినందున ఈ తాత్కాలిక నియామకం చేపట్టారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు శారద డీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News November 24, 2025
కొడంగల్ వేదికగా స్థానిక ప్రచారం మొదలెట్టిన సీఎం

TG: 3-4 రోజుల్లో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రచారాన్ని తన సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి ప్రారంభించారు. ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని, మహిళలు ఆ చీరలు కట్టుకొని అభివృద్ధికి అండగా నిలిచే వారికి ఓటేయాలన్నారు. పదేళ్లు అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా త్వరలోనే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు SEC షెడ్యూల్ విడుదల చేయనుంది.
News November 24, 2025
ఆ మద్యం దుకాణాన్ని తొలగించండి: నంద్యాల కలెక్టర్

నవంబర్ 7న జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రతినిధులు ప్రస్తావించిన అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. నందికొట్కూరు మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మద్యం దుకాణం విద్యార్థుల్లో చెడు అలవాట్లకు దారితీస్తోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మద్యం దుకాణాన్ని తొలగించే చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఆదేశించారు.


