News February 15, 2025
స్వచ్ఛ్ ఆంధ్రలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం

స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర మిషన్ లక్ష్యసాధనలో శ్రీ సత్యసాయి జిల్లాకు 19వ స్థానం దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర మిషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేకంగా ఓ థీమ్ తీసుకొని పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. చెత్త సేకరణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి వాటిలో 105 పాయింట్లతో జిల్లా 19వ స్థానంలో నిలిచింది.
Similar News
News April 18, 2026
జీవప్రాణులకు జలమే ఆధారం: VZM కలెక్టర్

జీవప్రాణులకు జలమే ఆధారమని విజయనగరం కలెక్టర్ రాంసుందర రెడ్డి పేర్కొన్నారు. శనివారం అలకనంద కాలనీలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్రలో భాగంగా పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఇంకుడు గుంతను పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకొనే విధంగా ప్రజా చైతన్యం రావాలన్నారు. భూగర్భ జలాలను కాపాడుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
News April 18, 2026
KNR: మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్వర్ తెలిపారు. ఆస్ట్రేలియా, ఓమన్, జర్మనీ, గ్రీసీ, ఖతార్ తదితర దేశాల్లో వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయని, ఐటీఐ, డిగ్రీ, పీజీ, డిప్లోమా, నర్సింగ్ కోర్సులు చదివి 21 నుంచి 58 ఏళ్లలోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9440051285, 9440051452 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
News April 18, 2026
పోలీసులకు వారాంతపు సెలవులపై చర్యలు తీసుకోవాలి: ADB SP

పోలీసులకు వారాంతపు సెలవులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఎండాకాలం దృష్ట్యా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తగినంత నీరు తాగడం, ఎండలో బయటకు వెళ్లే సందర్భంలో రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. త్వరలోనే సిబ్బందికి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్రమాలపై సమాచారం అందించిన సిబ్బందికి ప్రోత్సహిస్తామన్నారు.


