News March 16, 2025

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి

image

స్వచ్ఛ సర్వేక్షన్- 2024లో మెరుగైన ర్యాంకు సాధనకు కృషి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. బల్దియా పరిధిలోని షీ టాయిలెట్స్‌తో పాటు పబ్లిక్ టాయిలెట్స్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటి పనితీరును ఎంహెచ్ఓ అడిగి తెలుసుకున్నారు. నగరానికి మారు ఓడిఎఫ్ ++ సర్టిఫికెట్ సాధించేలా ప్రజా మరుగుదొడ్లు నిర్వహణ ఉండాలన్నారు. మరమ్మతులు అవసరమైతే వెంటనే చేయించాలని తెలిపారు.

Similar News

News April 18, 2025

సిరిసిల్ల: తెలంగాణ సాయుధ రైతన్న పోరాట వీరుడు కర్రోల్ల నర్సయ్య

image

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు కర్రోళ్ల నర్సయ్య వర్థంతి నేడు. ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1957 నుండి1962 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో జన్మించారు. 2003లో ఏప్రిల్ 17న గుండెపోటుతో మరణించారు. నర్సయ్య భార్య దుర్గమ్మ గతంలో చనిపోయిందని, ఇద్దరు కుమారులలో ఒక కుమారుడు ఇటీవలే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 18, 2025

జాట్ మూవీ టీంపై కేసు నమోదు

image

జాట్ మూవీ టీంపై పంజాబ్ జలంధర్‌లో కేసు నమోదైంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు క్రిస్టియన్ల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ వికల్ప్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో సన్నీడియోల్, గోపీచంద్ మలినేనితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సన్నీడియోల్ హీరోగా నటించారు. ఏప్రిల్ 10న విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం సొంతం చేసుకుంది.

News April 18, 2025

రేపు రామాపురం బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమాలు

image

స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల 19వ తేదీ శనివారం ఉదయం 9:30 గంటలకు చీరాల మండలం రామాపురం బీచ్‌లో క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రత్యేక అధికారి కృత్తిక శుక్లా, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం.కొండయ్య, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారని పేర్కొన్నారు.

error: Content is protected !!