News April 18, 2024
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తా: జయరాజు
బీజేపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు స్వతంత్ర అభ్యర్థిగా నేడు (గురువారం) నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కురుపాంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అరకు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నట్లు జయరాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి అభిమానులు హాజరవ్వాలని కోరారు.
Similar News
News September 13, 2024
విజయనగరం: ఈ నెల 16న గ్రీవెన్స్ రద్దు
ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వం సెలవు ప్రకటించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వివిధ సమస్యలపై అర్జీలు అందించడానికి వచ్చే ప్రజలు ఈ విషయం గమనించాలని సూచించారు.
News September 13, 2024
కలెక్టర్ ఔదార్యం.. వసతి గృహాలకు ఫ్యాన్ల పంపిణీ
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఔదార్యం చూపారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సంక్షేమ శాఖల పరిధిలో గల మరిపివలస, సాలూరు, పార్వతీపురం, కురుపాం, జియ్యమ్మవలస, చినమేరంగి, రావివలస, గరుగుబిల్లి వసతిగృహాలకు 20 ఫ్యాన్లను సొంత ఖర్చులతో సమకూర్చారు. వాటిని కలెక్టరేట్లోని తన చాంబర్లో సంబంధిత వసతి గృహాల సంక్షేమ అధికారులకు అందజేశారు.
News September 13, 2024
ఈ నెల 17 నుంచి ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు: కలెక్టర్
విజయనగరం జిల్లాలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకొని ఈ నెల 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ‘స్వచ్ఛతా హై సేవా’ కార్యక్రమాలు జరుగుతాయని, అక్టోబర్ 2న స్వచ్చ భారత్ దివాస్‌గా జరుపుకుంటామని తెలిపారు.