News April 28, 2024

స్వతంత్ర అభ్యర్థి వేటుకూరికి సింహం గుర్తు

image

ఉండి నియోజకవర్గ రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో ఆ పార్టీ గుర్తు అయిన సింహం శివరామరాజుకు లభించింది. ఇప్పటివరకు స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న శివరామరాజు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవనున్నారు.

Similar News

News April 14, 2026

ప్రైవేటు స్కూళ్ల అడ్మిషన్ల ప్రకటనలతో జాగ్రత్త: డీఈవో

image

అనుమతులు లేని ప్రైవేటు పాఠశాలలు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నట్లు ఇచ్చే ప్రకటనలను నమ్మవద్దని డీఈవో నారాయణ తల్లిదండ్రులను హెచ్చరించారు. పాఠశాలకు గుర్తింపు ఉందో లేదో, భవన వసతులు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ప్రకటనలు జారీ చేసే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

News April 14, 2026

కలెక్టరేట్‌లో ఉద్యోగాలంటూ SMలో వైరల్.. ఖండించిన కలెక్టర్

image

జిల్లా కలెక్టరేట్‌లో రాత పరీక్ష లేకుండా 40 పోస్టుల భర్తీ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఖండించారు. ఈ వీడియోలు పూర్తిగా అవాస్తవమని, నిరుద్యోగులు వీటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఉద్యోగాల పేరిట ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఏదైనా సమాచారం ఉంటే ఒకటికి రెండుసార్లు అధికారికంగా సరిచూసుకోవాలని ఆమె సూచించారు. నకిలీ వార్తలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.