News February 13, 2026

స్వదేశీ ఆపిల్స్‌ను గుర్తించండిలా!

image

ఆరోగ్యానికి మేలు చేసే <<19126815>>స్వదేశీ<<>> ఆపిల్ పండ్లను ఇలా గుర్తించవచ్చు. స్వదేశీ ఆపిల్స్ సహజమైన రంగులో తక్కువ మెరుపుతో ఉంటాయి. వీటిపై విదేశీ రకాల వలె కృత్రిమ మైనం పూత ఉండదు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన రాయల్ డెలీషియస్, పసుపు రంగు గోల్డెన్ డెలీషియస్, కశ్మీర్ స్పెషల్ అంబ్రి రకాలు మన దేశంలో ప్రసిద్ధి. తాజాదనం, రుచి కోసం వీటిని ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు తెలుపుతున్నారు. share it

Similar News

News March 13, 2026

రోహిత్, కోహ్లీ కోసం BCCI స్పెషల్ ప్లాన్స్!

image

T20 WC విజయం తర్వాత BCCI కన్ను ఇప్పుడు 2027 ODI WCపై పడింది. రోహిత్, కోహ్లీ ODIలే ఆడుతుండగా వీరికి మరిన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం కల్పించేలా విదేశీ పర్యటనల్లో అదనపు సిరీస్‌లను చేర్చేందుకు బోర్డు సిద్ధమవుతోంది. 2011 తర్వాత దక్కని వన్డే WC సాధించాలని పట్టుదలగా ఉంది. అందుకోసం NZ, ఇంగ్లండ్ వంటి జట్లతో అదనపు మ్యాచ్‌లు ఆడుతూ ఈ ఇద్దరు దిగ్గజాలను మెగా టోర్నీకి రెడీ చేసేందుకు BCCI ప్లాన్ చేస్తోంది.

News March 13, 2026

పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

image

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.

News March 13, 2026

స్పెర్మ్ రేసింగ్‌ ప్రపంచకప్.. లక్ష డాలర్ల ప్రైజ్ మనీ!

image

పురుషుల్లో ఫెర్టిలిటీపై అవగాహనకు ఓ US స్టార్టప్ వినూత్నంగా స్పెర్మ్ రేసింగ్ ప్రపంచకప్ నిర్వహిస్తోంది. విజేతలకు $1,00,000 (₹92.33L) ప్రైజ్ మనీ ఇస్తారు. హెల్త్, శాంపిల్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మైక్రోస్కోప్‌లో వీర్యకణాలకు క్వాలిఫయింగ్ రేస్, హెడ్ టు హెడ్, ఫైనల్ నిర్వహిస్తారు. 2025లో USలో $10,000 క్యాష్ ప్రైజ్‌తో నిర్వహించిన రేస్ సక్సెస్ కావడంతో ఈసారి 128 దేశాల అథ్లెట్లతో టోర్నీ జరపనుంది.