News January 18, 2026
స్వర్గలోక ప్రాప్తి కోసం నేడు ఏం చేయలంటే?

చొల్లంగి అమావాస్య నాడు పితృదేవతలకు మోక్షం ప్రసాదించడానికి నదీ స్నానం చేయాలి. పితృ తర్పణాలు, పిండ ప్రదానాలు చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వులు నింపిన రాగి పాత్రను, వస్త్రాలను, అన్నాన్ని పేదలకు లేదా బ్రాహ్మణులకు దానం చేయాలి. మౌనవ్రతం పాటిస్తూ శివారాధన చేయడం వల్ల సకల జాతక దోషాలు తొలగి పుణ్యగతులు లభిస్తాయి. రుద్రాభిషేకంతో మంచి ఫలితాలుంటాయి. నవగ్రహాల ప్రదక్షిణ మంచిది’ అంటున్నారు.
Similar News
News February 15, 2026
కెప్టెన్సీ నుంచి ధోనీని బలవంతంగా తప్పించిన బీసీసీఐ!

2017లో భారత జట్టు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకోవడానికి గల కారణాలను మాజీ సెలక్టర్ జతిన్ పరాంజపే తాజాగా వెల్లడించారు. కెప్టెన్‌గా దిగిపోవాలని అప్పటి చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్, తాను కోరినట్లు తెలిపారు. అందుకు MS అంగీకరించారని, రాతపూర్వకంగా తెలియజేయాలని కోరితే ఈమెయిల్ పంపారని చెప్పారు. ఆ తర్వాత కోహ్లీకి మద్దతుగా నిలిచారని కొనియాడారు. 2014లో టెస్టులకు, 2020 ODI, T20లకు ధోనీ రిటైర్మెంట్ ప్రకటించారు.
News February 15, 2026
శివరాత్రి.. ఈ తప్పులు చేయకండి!

మహాశివరాత్రి నాడు తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల పూజా ఫలం దక్కదని పండితులు అంటున్నారు. ‘తులసి ఆకులతో పూజ చేయొద్దు. శివుడికి బిల్వపత్రాలంటేనే ఇష్టం. లింగానికి పసుపు, కుంకుమ పూయొద్దు. విభూతి రాయాలి. శంఖం, రాగి పాత్రతో అభిషేకం చేయొద్దు. ఉపవాసం ఉన్న వాళ్లు మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. జాగరణ అంటే వినోదం, కాలక్షేపం కాదు.. ఓం నమశ్శివాయ మంత్రాన్ని స్మరించాలి’ అని చెబుతున్నారు.
News February 15, 2026
ఎద్దు ఎండకులాగ, దున్న నీడకు లాగ

ఎద్దు ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకుని ఎండలో కూడా పని చేస్తుంది. ఇది కష్టపడే తత్వానికి నిదర్శనం. దున్నపోతుకు కాస్త ఎండ తగిలినా భరించలేదు, అది ఎప్పుడూ నీడ కోసం లేదా నీళ్ల కోసం(చల్లదనం కోసం) వెతుకుతుంది. ఇది సుఖాన్ని కోరుకునే తత్వానికి నిదర్శనం. ఒకే ఇంట్లో లేదా ఒకే చోట ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఎంతో కష్టపడే స్వభావం కలిగి ఉంటే, మరొకరు సోమరిగా ఉంటూ సుఖాన్ని కోరుకుంటున్నారని చెప్పడానికి ఈ సామెత వాడతారు.


