News October 18, 2024
స్వర్ణకారుల 60ఏళ్ల కలను నెరవేర్చడం నాకు సంతోషంగా ఉంది: లోకేశ్
స్వర్ణకారుల 60ఏళ్ల కలను నెరవేర్చడం తనకు సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేసినందుకు లక్ష్మినరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తనను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారని చెప్పారు. కేట్ కట్ చేయించి తమ ఆనందాన్ని పంచుకున్నారన్నారు. మంగళగిరిని గోల్డ్ హబ్ చేసే లక్ష్యంతో అంతా కలిసి పనిచేద్దామని పిలుపు ఇచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News November 13, 2024
రామ్ గోపాల్ వర్మపై కేసు.. వివరాలు ఇవే.!
సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తుళ్ళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేశ్‌లపై అసభ్యంగా పోస్టులు పెట్టారని పెదపరిమి గ్రామానికి చెందిన నూతలపాటి రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా U/S 336(4), 353(2), 356(2), 61(2), 196, 352 BNS, Sec. 67 ఆఫ్ IT యాక్ట్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News November 13, 2024
ఆయనపై చర్యలు తీసుకోవద్దు: హైకోర్డు
వేమూరు మాజీ MLA మేరుగు నాగార్జున క్వాష్ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో మేరుగుపై పద్మావతి అనే మహిళ అత్యాచారం కేసు పెట్టగా.. ఇటీవల కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. కేసును ఏం చేస్తారని హైకోర్టు పోలీసులను అడిగింది. రిటర్న్ రిపోర్టు ఇవ్వాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
News November 13, 2024
యువతిని గర్భిణిని చేసిన మామ
తండ్రిలేని యువతిని మేనమామ గర్భిణీని చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. భట్టిప్రోలుకి చెందిన 18ఏళ్ల యువతికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. ఈ నేపథ్యంలో ఆ యువతి ఆదిలాబాద్‌లో ఉంటున్న పెద్ద మేనమామ వద్ద ఉంటోంది. ఒంగోలులో ఉంటున్న చిన్న మేనమామ ఇటీవల ఆదిలాబాద్ వెళ్లాడు. ఈ క్రమంలో అతను కోడలిని లొంగదీసుకొని గర్భిణీని చేశాడు. యువతికి తీవ్ర కడుపు నొప్పి రాగా.. వైద్యులు గర్భిణిగా నిర్దారించారు.