News March 15, 2025
స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర అమలు చేయండి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారులు, పురపాలక సంఘం అధికారులు గ్రామాలలో, వార్డుల్లో కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి మూడో శనివారం ముందు రోజు రాత్రి గ్రామాలలో అధికారులు బస చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలన్నారు.
Similar News
News November 27, 2025
వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. లాక్ డౌన్

వాషింగ్టన్(US)లోని వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. దుండగుల కాల్పుల్లో ఇద్దరు జాతీయ భద్రతాదళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్ను లాక్ డౌన్ చేశారు. ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. దేశ రాజధానిలో నేరాల కట్టడికి ట్రంప్ వాషింగ్టన్ అంతటా వేలాది మంది సైనికులను మోహరించిన తరుణంలో కాల్పులు జరగడం గమనార్హం.
News November 27, 2025
కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.
News November 27, 2025
KTDM: పోలీస్ స్టేషన్లో ఒక్కటైన ‘మూగ’ జంట

ప్రేమకు మాటలు అక్కర్లేదని నిరూపిస్తూ బూర్గంపాడు పోలీస్ స్టేషన్ వేదికగా మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న ఓ జంట ఒక్కటయ్యింది. పెళ్లి కోసం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా, పోలీసులు ఇరు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఒప్పించారు. చివరకు పోలీసుల సమక్షంలోనే ఆ జంట దండలు మార్చుకుంది. అక్కడ పోలీసులు కేవలం చట్టాన్ని అమలు చేసేవారిలా కాకుండా, మనసున్న మారాజులుగా వ్యవహరించారు.


