News February 4, 2025

స్వల్పంగా తగ్గిన ఆయిల్ ఫాం గెలల ధర

image

ఆయిల్ ఫాం గెలల ధర జనవరి నెలకు స్వల్పంగా తగ్గింది. గత ఏడాది డిసెంబర్‌లో టన్ను ధర రూ.20,506 ఉంది. జనవరికి రూ.20,487కు తగ్గింది. జనవరిలో ఫ్యాక్టరీకి తరలించిన గెలలకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని ఆయిల్ ఫెడ్ డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ తెలిపారు.

Similar News

News February 12, 2025

బోయిన్పల్లి: మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ

image

బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్ఎండికి 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంట పొలాలకు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News February 12, 2025

HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్​ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఆ శాఖ కార్యదర్శి లోకేశ్​కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వంవైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేసిన, చేయాల్సిన ఏర్పాట్లు, డెడికేటెడ్ ​కమిషన్ ​నివేదికపై చర్చించనున్నారు.

News February 12, 2025

నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి

image

నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు. 

error: Content is protected !!