News September 8, 2024

స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు

image

ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

Similar News

News October 11, 2024

ఖమ్మం: ఒకే గ్రామం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్

image

వైరా మండలం రెబ్బవరం నుంచి 8 మంది టీచర్లుగా సెలెక్ట్ అయ్యారు. గోపాలరావు, కవిత, రాము, జాలది ఉష, దివ్య, సుజాత, శిరీష, ఖాసీమ్ డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగాలు సాధించారు. వారిని రెబ్బవరం స్కూలు పూర్వ విద్యార్థుల సంఘం, గ్రామ పెద్దలు సన్మానించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పాలని వారికి సూచించారు.

News October 11, 2024

రతన్ టాటాతో ఖామ్మానికి అనుబంధం

image

పారిశ్రామిక దిగ్గజం, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా 1983లో ఖమ్మం వచ్చారు. గాంధీచౌక్‌లో వ్యాపారవేత్త కాళ్ల వెంకట రామారావు తెలంగాణ ఏజెన్సీస్‌ను నెలకొల్పగా, నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్ షిప్ తీసుకున్నారు. అంతేకాక ఈ కంపెనీ డీలర్ల రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈమేరకు నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ డీలర్షిప్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా రతన్ టాటా హాజరయ్యారు.

News October 11, 2024

KMM: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.