News February 19, 2026

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 28 పాయింట్లు లాభపడి 83,762 వద్ద.. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 25,831 దగ్గర కొనసాగుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో HCL, టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫీ షేర్లు లాభాల్లో.. ఇండిగో, KWIL, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Similar News

News March 17, 2026

తిరుమలలో గ్యాస్ కొరత.. పలు దుకాణాలు మూసివేత!

image

AP: తిరుమలలో గ్యాస్ సిలిండర్ల కొరత మొదలైంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో పలు టీ షాప్‌లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను నిర్వాహకులు మూసివేశారు. సిలిండర్ల కోసం గోడౌన్ వద్ద బారులు తీరారు. కాగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల గ్యాస్ కొరత ప్రభావం కనిపిస్తోంది.

News March 17, 2026

ఆధారాలివిగో.. KTR రాజీనామా చెయ్: సీతక్క

image

TG: మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ₹57000 కోట్ల రుణాలు ఇచ్చినట్లు రిపోర్టులు చూపిస్తే రాజీనామా చేస్తానన్న KTR <<19406367>>సవాల్‌పై<<>> మంత్రి సీతక్క స్పందించారు. అందుకు సంబంధించిన ఆధారాలు విడుదల చేస్తూ… సవాల్‌కు కట్టుబడి KTR రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘాలకు ₹57000 కోట్లు రుణాలివ్వడమే కాకుండా వడ్డీ భారాన్నీ ప్రభుత్వమే భరిస్తోందన్నారు. ఇప్పటివరకు ₹1,390 కోట్లు వడ్డీ కింద చెల్లించామని వివరించారు.

News March 17, 2026

సెక్రటేరియట్ టవర్స్‌: AC, ఎలక్ట్రికల్, పంబ్లింగ్ వర్క్స్‌కు రూ.2316 కోట్లు

image

AP: అమరావతిలో నిర్మిస్తున్న సెక్రటేరియట్ టవర్స్‌లో హైసైడ్ ఎలక్ట్రికల్, HVAC, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్, ఫైర్ అలారమ్, పంబ్లింగ్ తదితర పనులకు రూ.2316.88 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం CRDAకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ GO ఇచ్చింది. GAD టవర్‌తో పాటు 1, 2, 3, 4 టవర్లలోని సదరు పనులకు ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 53L చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు.