News February 9, 2026
స్వల్ప వృద్ధితోనే గుంటూరు జిల్లా ఆదాయ వసూళ్లు

గుంటూరు జిల్లా మున్సిపల్ ఆదాయ వసూళ్లలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మొత్తం వసూలు చేయాల్సింది ₹452.15 కోట్లుగా నమోదైంది. ఫిబ్రవరి 9 వరకు వసులుచేసింది ₹152.35 కోట్లు మాత్రమే అది 33.70%గా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో ₹152.29 కోట్లు వసూలు కాగా, ఈ ఏడాది స్వల్పంగా 3.90% వృద్ధి నమోదైంది. లక్ష్య సాధనలో ఇంకా వేగం పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Similar News
News March 17, 2026
ప్రమాదాలు తగ్గాయి.. ఇదే చొరవ కొనసాగించాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఈ ఏడాది తగ్గాయని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. రహదారి భద్రత కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. 2024లో 1,046 ప్రమాదాలు జరిగాయని, 2025 లో 910 జరిగాయని తెలిపారు. మరణాలు కూడా 19 శాతం తగ్గాయని చెప్పారు.
News March 17, 2026
మంగళగిరి: దివ్యాంగులకు రేపటి నుంచి ఉచిత బస్సు ప్రయాణం!

రాష్ట్రంలోని 40 శాతం వికలాంగత్వం ఉన్న దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకాన్ని ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు మంగళగిరి బస్టాండ్ వద్ద సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలుత గుంటూరులో అనుకున్నా, కొన్ని కారణాల వల్ల వేదికను మంగళగిరికి మార్చారు. ఈ మేరకు ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా పర్యవేక్షించారు.
News March 17, 2026
మంగళగిరిలో ఏపీఈడీబీ నూతన కార్యాలయం ప్రారంభం

మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) నూతన కార్యాలయాన్ని మంత్రి నారా లోకేశ్ లాంఛనంగా ప్రారంభించారు. అధికారులకు ఆయన కీలక దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, ఆ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చేలా అధికారులు గట్టి కృషి చేయాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.


