News August 15, 2024

స్వాతంత్రోద్యమం.. పాలమూరుకు వీడదీయలేని బంధం

image

పాలమూరులో లోకాయపల్లి సంస్థానాధీశులు పట్టణ నలువైపులా 4 ప్రవేశ ద్వారాలను నిర్మించారు. 3 కమాన్లు కాలగర్భంలో కలిసిపోగా తూర్పు కమాన్ మాత్రం మిగిలింది. స్వాతంత్రోద్యమానికి తూర్పుకమాన్ ‌కు వీడదీయలేని సంబంధం ఉంది. 1947 ఆగస్టు 15న ఎక్కడా త్రివర్ణపతాకాలు ఎగరేయవద్దని హుకూం జారీ చేశారు. నిజాం పోలీసులు గస్తీ తిరిగినా వారి కన్నుగప్పి ఉద్యమకారుడు విరివింటి లక్షణమూర్తి తూర్పు కమాన్ పై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

Similar News

News October 26, 2025

MBNR: సాదాబైనామాల పరిష్కారానికి మోక్షం

image

సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి మోక్షం కలగనుంది. జీఓ 112 అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో క్రమబద్ధీకరణ ప్రక్రియను రెవెన్యూ అధికారులు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 2020లో ఆన్‌లైన్‌లో వచ్చిన 4,217, ఇటీవల రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 3,456 దరఖాస్తుల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించారు. దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

News October 25, 2025

బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

image

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News October 25, 2025

రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.