News August 7, 2024

స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: జేసీ

image

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండులో నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఏర్పాట్ల నిర్వహణపై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ, సాయుధ దళాల మార్చ్ ఫాస్ట్, వేదిక, తదితర ఏర్పాట్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

Similar News

News September 14, 2024

ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు: ఎస్పీ

image

కర్నూలులో రేపు గణేశ్ నిమజ్జనోత్సవం నేపథ్యంలో పోలీస్ పరేడ్ మైదానంలో బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందితో ఎస్పీ బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ‘ఎక్కడా చిన్నపాటి సంఘటన చోటు చేసుకోకూడదు. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు. శోభయాత్రలో ప్రజలు, భక్తుల పట్ల పోలీసులు సత్ప్రవర్తనతో మెలగాలి. నిమజ్జనం ముగిసే వరకు పోలీసులు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలి’ అని దిశా నిర్దేశం చేశారు.

News September 14, 2024

కొండారెడ్డి బురుజుకు ఆ పేరెలా వచ్చింది?

image

కర్నూలులోని కొండారెడ్డి బురుజును క్రీ.శ 16వ శతాబ్దంలో అచ్యుతదేవరాయులు నిర్మించారు. 1602-1618 మధ్య అబ్దుల్ వహాబ్ కందనవోలును పరిపాలించే వారు. ఆ సమయంలో నందికొట్కూరు తాలుకాలోని పాతకోట పాలెగాడైన కొండారెడ్డి అతని అధికారాన్ని ధిక్కరించారట. దీంతో వహాబ్ కొండారెడ్డిని ఓడించి ఈ బురుజులోని కారాగారంలో బంధించాడు. అందులోనే మరణించడంతో అతని పేరుమీద దీనికి కొండారెడ్డి బురుజు అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

News September 14, 2024

కర్నూలు: 16న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

image

ఈ నెల 16న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా శనివారం ఓ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రం, డివిజన్ స్థాయి, మున్సిపాలిటీ, మండల స్థాయిలో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.