News August 9, 2024
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా జిల్లా స్థాయి ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అతిధులతో పాటు సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాల శకటాలు, స్టాల్స్ ప్రదర్శించాలన్నారు.
Similar News
News September 19, 2025
డయేరియా బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది: కలెక్టర్

డయేరియాపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. బుధవారం 33 మంది డయేరియా లక్షణాలతో జీజీహెచ్‌లో చేరారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. రోగులు కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల వ్యాధి ప్రబలిందని వైద్యుల ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. తాగునీటి శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపుతున్నామన్నారు.
News September 19, 2025
గుంటూరు రైల్వేస్టేషన్లో కొత్త సదుపాయం

రాబోయే పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికుల కోసం టిక్కెట్ కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసింది. గుంటూరు స్టేషన్లో సిబ్బంది ధరించే జాకెట్ల వెనుక భాగాన క్యూఆర్ కోడ్ అమర్చారు. ప్రయాణికులు యూటీఎస్, రైల్ వన్ యాప్ ద్వారా ఆ కోడ్‌ను స్కాన్ చేసి కాగిత రహిత టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. ఇకపై 5KM లోపు ఇంటి నుంచే జనరల్, ప్లాట్‌ఫామ్, సీజన్ టిక్కెట్లు బుక్ చేసుకునే సౌకర్యం లభిస్తోంది.
News September 19, 2025
గుంటూరు జిల్లా రైతులకు శుభవార్త

గుంటూరు జిల్లాలో రైతుల అవసరాల నిమిత్తం తాజా ఎరువుల సరఫరా జరిగింది. గురువారం రెడ్డిపాలెం రైల్వే స్టేషన్ రేక్ పాయింట్‌కు 330 మెట్రిక్ టన్నుల యూరియా వ్యాగన్ల ద్వారా చేరింది. స్టాక్‌ను ఏడీఏ మెహనరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లాకు వచ్చిన ఈ సరఫరాలో మార్క్‌ఫెడ్‌కు 250 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్లకు 80 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.