News August 9, 2024

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలి: కలెక్టర్

image

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా జిల్లా స్థాయి ఇండిపెండెన్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నందున విస్తృత ఏర్పాట్లు చేయాలన్నారు. అతిధులతో పాటు సాంస్కృతిక, అభివృద్ధి కార్యక్రమాల శకటాలు, స్టాల్స్ ప్రదర్శించాలన్నారు. 

Similar News

News September 9, 2024

11న గుంటూరు రానున్న వైసీపీ అధినేత జగన్

image

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11న గుంటూరు నగరానికి రానున్నారు. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసు విషయంలో బ్రాడీపేటలోని సబ్- జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌తో ఈ సందర్భంగా జగన్ ములాఖత్ కానున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు రోడ్డు మీదుగా సబ్ జైలుకు జగన్ చేరుకోనున్నారు.

News September 9, 2024

మంత్రి అనగాని ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు

image

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓఎస్డీగా మాజీ ఐఏఎస్ సుబ్బారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహించి పదవి విరమణ చేశారు. అనంతరం మంత్రి ఓఎస్‌డీగా నియమితులై సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తహశీల్దార్‌ నుంచి ఈ స్థాయికి చేరుకున్నారు.

News September 9, 2024

24 గంటల్లోగా పంట నష్టం అంచనా వేయాలి: కలెక్టర్

image

భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల అంచనాను 24 గంటల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. ప్రభుత్వం అందించిన ఫార్మాట్లలో సమాచారాన్ని పొందుపరచాలన్నారు. వ్యవసాయం, ఉద్యానవనం, మత్స్యశాఖ అంచనాలు విడివిడిగా అందజేయాలన్నారు. పట్టణాలు, మండలాల్లో ఇళ్లు దెబ్బతిన్న వాటిని వేర్వేరుగా నమోదు చేయాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.