News August 3, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నిర్వహించే వేడుకలను ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశా నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో పోలీసు పెరెడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పై శుక్రవారం జిల్లా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Similar News

News December 20, 2025

చిత్తూరు: ‘బాలికను గర్భిణీని చేశాడు’

image

బాలికపై లైంగిక దాడి చేసిన వ్యక్తిని పోక్సో కేసులో అరెస్ట్ చేసినట్టు నగిరి డీఎస్పీ మహమ్మద్ అజీజ్ తెలిపారు. వెదురుకుప్పం మండలంలోని 14 ఏళ్ల బాలికపై మురళి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు కడుపునొప్పి వస్తుండటంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో గర్భం అని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.

News December 19, 2025

చిత్తూరు: పెళ్లయి 21 ఏళ్లు.. 14 మంది పిల్లలు.!

image

చిత్తూరు జిల్లాలో ఓ జంటకు పెళ్లై 21 ఏళ్లలో 14 మంది పిల్లలు పుట్టారంటే నమ్మండి. వీరిలో 7 మంది మగ పిల్లలు, 7 మంది ఆడపిల్లలు జన్మించగా.. వారిలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. GDనెల్లూరు(M) ఆవల్ కండ్రిగకు చెందిన దంపతులకు 21 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ క్రమంలో సదరు మహిళ గురువారం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 14వ బిడ్డగా మగ పిల్లాడికి జన్మనిచ్చింది.

News December 19, 2025

చిత్తూరు: అర్జీల పరిష్కారంలో వెనుకబాటు.!

image

PGRS వినతుల పరిష్కారంలో చిత్తూరు జిల్లా వెనుకబాటులో ఉంది. కలెక్టర్ల సదస్సులో ఈ మేరకు నివేదిక వెలువడింది. నిర్దేశించిన గడువులో వాటిని పరిష్కరించకపోవడంతో ఈ విభాగంలో జిల్లా 7.27%తో రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. అర్జీల రీ ఓపెన్‌లో 14.52 శాతంతో మూడో స్థానంలో ఉంది. LPM తిరస్కరణలో 28.85 శాతంతో మూడో స్థానంలో ఉంది.