News August 9, 2024

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి సవిత

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యఅతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పాల్గొననున్నారు. జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో 15వ తేదీ జరిగే జాతీయ పతాక ఆవిష్కరణకు మంత్రి సవిత ముఖ్యఅతిథిగా హాజరవుతారని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

Similar News

News September 10, 2024

వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం

image

విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.

News September 10, 2024

అనంతపురం చేరుకున్న భారత్-ఏ, బీ జట్ల ప్లేయర్లు

image

అనంతపురంలో దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ క్రికెట్ పోటీలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. బెంగళూరులో తొలి మ్యాచ్ ఆడిన భారత్-ఏ, బీ జట్లు నిన్న రాత్రి అనంతపురానికి చేరుకున్నాయి. కేఎల్ రాహుల్, దూబే, పంత్, మయాంక్, రియాన్ పరాగ్ తదితర క్రికెటర్లకు హోటళ్లలో ఘన స్వాగతం పలికారు. క్రికెట్లరను చూడటానికి అభిమానులు హోటల్ వద్ద పడిగాపులు కాశారు. క్రికెటర్లు బస చేసే హోటళ్ల వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

News September 10, 2024

తాడిపత్రిలో అగ్నిప్రమాదం

image

తాడిపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఓ షాపింగ్ మాల్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.