News April 12, 2025

స్వామి, అమ్మ‌వార్లు పూల‌మాల‌లు మార్చుకోవ‌డ‌మే ఎదుర్కోలు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వ‌హించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.

Similar News

News October 23, 2025

మానవపాడు: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల ఫైన్

image

ఏపీ నుంచి తెలంగాణలోని గ్రామాలవైపు అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలు ఏవైనా పట్టుపడితే కేసులు, ఫైన్లు తప్పనిసరి వేస్తున్నామని తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ నెల 9న ఏపీలోని తాడిపత్రి నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై చంద్రకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. అట్టి వాహనాలకు ఒక్కొక్క వాహనంకు రూ.50 వేల ఫైన్ వేశామని, రెండోసారి వాహనం ఇసుకను రవాణా చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.

News October 23, 2025

ఆమరణ దీక్షకు దిగుతా: షర్మిల

image

ఆంధ్ర రత్న భవనం వద్ద వైఎస్ షర్మిల వర్షంలో తడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.700 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సేవలు పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

News October 23, 2025

తెలంగాణ రౌండప్

image

* రేపు ఫిరాయింపు MLAలను విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్..
* రంగారెడ్డి, వికారాబాద్, HNK, మేడ్చల్‌లో డీఅడిక్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
* వచ్చే నెల 20 నుంచి రాష్ట్రంలో పులుల లెక్కింపు.. నేటి నుంచి జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున శిక్షణ
* రంగారెడ్డిలోని కుర్మల్ గూడ, తొర్రూర్, మేడ్చల్‌లోని బహదూర్‌ పల్లి రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఈ నెల 28 నుంచి 30వరకు ఈ-వేలం