News April 12, 2025
స్వామి, అమ్మవార్లు పూలమాలలు మార్చుకోవడమే ఎదుర్కోలు

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం చెంత కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారాముల ఉత్సవమూర్తుల శోభాయాత్ర కల్యాణవేదిక వరకు వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కల్యాణవేదిక వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియనే ఎదుర్కోలు ఉత్సవం అంటారు.
Similar News
News April 25, 2025
విజయవాడ: జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)- లింగంపల్లి(LPI) మధ్య ప్రయాణించే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్లే మార్గంలో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.12805 VSKP- LPI ఏప్రిల్ 25 నుంచి, నం.12806 LPI- VSKP రైలు ఏప్రిల్ 26 నుంచి బేగంపేట, సికింద్రాబాద్‌లో ఆగదని, ఈ రైళ్లను ఆయా తేదీల నుంచి అమ్ముగూడ, చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.
News April 25, 2025
BREAKING: ఇస్రో మాజీ ఛైర్మన్ కన్నుమూత

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్(84) కన్నుమూశారు. ఇవాళ ఉదయం బెంగళూరులోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 1994 నుంచి 2003 వరకు ఆయన ఇస్రో ఛైర్మన్‌గా కొనసాగారు. PSLV, జీఎస్ఎల్వీ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషించారు. 2020 జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు.
News April 25, 2025
‘సారంగపాణి జాతకం’ రివ్యూ&రేటింగ్

ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ప్రియదర్శి, రూప జంటగా తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’ థియేటర్లలో విడుదలైంది. జాతకాలను నమ్మే హీరో పెళ్లి చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది సినిమా స్టోరీ. ప్రియదర్శి సహజ నటన, వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ మెప్పిస్తాయి. హీరోయిన్ రూప యాక్టింగ్, ఇంద్రగంటి రచన ఆకట్టుకుంటాయి. కాస్త స్లోగా అనిపించడం, ఊహించేలా కథ సాగడం మైనస్.
WAY2NEWS RATING: 2.75/5.