News May 12, 2024
స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోండి: ఎస్పీ మాధవ్ రెడ్డి

13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడమే తమ లక్ష్యమని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ మాధవ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మట్లాడారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
Similar News
News February 11, 2026
రైలు ద్వారా అరటి ఎగుమతికి సహకారం అందిస్తాం: కలెక్టర్

రైలు ద్వారా అరటి ఎగుమతిని చేపట్టేందుకు తగిన సహకారం అందిస్తామని ఎగుమతుదారులు, అరటి ఎగుమతి వీలైనంత త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రైల్వే ద్వారా తాడిపత్రి నుంచి జేఎస్‌పీటీ పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, అరటి ఎగుమతి దారులతో కలెక్టర్ సమీక్షించారు.
News February 11, 2026
నెలవారీ నేర సమీక్షా సమావేశం

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO, రేప్ కేసులు, 174 Cr.P.C కేసులు తదితర వాటి కేసులను పూర్తి చేయాలన్నారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News February 11, 2026
అనంత: ‘నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించండి’

తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించాలని సంబంధిత అధికారులను DMHO దేవి ఆదేశించారు. అక్కడి వైద్య సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలన్నారు. పేషంట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


