News January 31, 2025
హంద్రీనీవా కాలువ పనుల పరిశీలించిన మంత్రి సవిత

రోద్దం మండలంలోని బొక్షం పల్లి సబ్ స్టేషన్ వద్ద హంద్రీనీవా కాలువ పనులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి కాలువ పనులను పరిశీలించిన మంత్రి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
Similar News
News February 7, 2025
వైఎస్ జగన్ నివాసానికి చేరనున్న శైలజానాథ్

మాజీ పీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ మరికొద్ది సేపట్లో వైసీపీలోకి చేరునున్నారు. తన అనుచరులతో కలిసి ఆయన ఇప్పటికే తాడేపల్లిలోని జగన్ నివాసానికి చేరుకున్నారు. ఆయనకు జగన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు. శైలజానాథ్‌తో పాటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఉన్నారు.
News February 7, 2025
చీమకుర్తి: ‘న్యాయం జరిగే వరకు నా శవాన్ని తీయొద్దు’

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ‘నా చావుకు నా భార్య కుటుంబం. వాళ్లను వదిలిపెట్టొద్దు. నాకు న్యాయం జరిగేవరకు నా శవం కుళ్లినా తీయకండి. నాకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. మెదటి రాత్రి తర్వాతి నుంచి నా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.’ అని లెటర్లో పేర్కొన్నాడు.
News February 7, 2025
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న కూటమి: ధర్మశ్రీ

వాల్తేర్ డివిజన్ ను విచ్చన్నం చేసి ఒడిశాకు పెద్దపీట వేసారని అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం వైసీపీ పరిశీలకుడు కరణం ధర్మశ్రీ విమర్శించారు. అనకాపల్లిలో గురువారం మాట్లాడుతూ.. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. అనకాపల్లి, విశాఖ ఎంపీలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.