News April 5, 2025
హత్నూర: ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్ల భీముని చెరువులో గల్లంతైన ఇద్దరిలో ఒకరి మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మండలంలోని బోర్పట్ల గ్రామానికి చెందిన డప్పు నవీన్ కుమార్ మృతదేహం లభ్యమైందని చెప్పారు. కొండాపూర్ మండలం కొత్త గడి గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ మృతదేహం కోసం మత్స్యకారులు, గజ ఈతగాళ్లు గాలిస్తున్నారని చెప్పారు.
Similar News
News December 1, 2025
VJA: దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ సీఎం సోదరుడు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బడేటి ధర్మారావు, టీడీపీ రాష్ట్ర నాయకుడు రాంప్రసాద్తో పాటు పలువురు పాల్గొన్నారు.
News December 1, 2025
NGKL: జిల్లాలో 8 గ్రామ పంచాయతీలకు సింగిల్ నామినేషన్

NGKL జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసిపోయింది. మొత్తం 151 గ్రామపంచాయతీలకు గాను 8 GPలకు సింగిల్ నామినేషన్ దాఖలు అయింది. దీంతో అక్కడ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కానుంది. వంగూరులోని కొండారెడ్డిపల్లి, వెల్దండ మండలంలో బండోని పల్లి, కేస్లీ తాండ, తెలకపల్లి మండలంలో తాళ్లపల్లి, గుట్ట రాయిపాకుల, ఊర్కొండ మండలంలో గుండ్లగుంటపల్లి గ్రామాలలో సింగిల్ నామినేషన్ వేశారు.
News December 1, 2025
ఎయిడ్స్ వ్యాధి నివారణపై అవగాహన తప్పనిసరి: మన్యం కలెక్టర్

ఎయిడ్స్ వ్యాధి నివారణపై యువత తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్వతీపురంలోని కలెక్టరేట్లో సోమవారం మాట్లాడారు. ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా అరికట్టాలంటే నివారణ ఒక్కటే మార్గమని, వ్యాధిగ్రస్తులను చులకనగా చూడొద్దన్నారు. వ్యాధి సోకిన వారు అపోహలు మాని ఆసుపత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలని సూచించారు.


