News April 14, 2024
హత్నూర పేలుడు ఘటన దర్యాప్తులో ఆసక్తికర అంశాలు !
ఎస్‌బీ ఆర్గానిక్స్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్ఫోటనం అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశ్రమలో పేలుడు పదార్థాల(ఎక్స్‌ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యకలాపాలు జరిగినట్లు భావిస్తున్నారు. 40చోట్ల రసాయన అవశేషాల శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది.
Similar News
News November 26, 2024
శైలజ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీశ్ రావు
ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు.
News November 26, 2024
గజ్వేల్: ఆవాలతో అంబేద్కర్ చిత్రం అదుర్స్
రాజ్యాంగం అమోదించి 75సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రాన్ని గజ్వేల్ కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవ రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవాలతో చిత్రించి అంబేద్కర్‌పై ఉన్న గౌరవాన్ని చాటాడు. రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని ఆవాలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.
News November 26, 2024
ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.