News May 18, 2024
హత్నూర: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి
హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రియా తాండకు చెందిన గుగులోత్ పప్యా తన బైక్‌పై పని నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా, సిరిపురం గ్రామ శివారులో వెనక నుండి వచ్చిన డీసీఎం బైకును ఢీ కొట్టింది. దీంతో పప్యా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి మెదక్ REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్‌లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?
News December 7, 2024
MDK: ఇన్‌ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?
తూర్పు వరంగల్ MLA కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆమెకు CM రేవంత్ దేవాదాయ & అటవీ శాఖలు కేటాయించడంతో పాటు MDK ఇన్‌ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌ఛార్జ్ మంత్రిగా MDKలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రూ.500 గ్యాస్, రుణమాఫీ, జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మీ కామెంట్?
News December 7, 2024
సంగారెడ్డి: ACBకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
లంచం తీసుకుంటూ కల్హేర్ మండలం మాసాన్‌పల్లి పంచాయతీ కార్యదర్శి ఉమేశ్ ACBకి చిక్కాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మహదేవుపల్లి చౌరస్తాలో ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు బ్యాంక్ లోన్ ఎల్‌ఓసీ సర్టిఫికెట్ కోసం ఉమేశ్‌ను ఆశ్రయించాడు. దీంతో ఎల్‌ఓసీ ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం అడగడంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. ఎంపీడీఓ ఆఫీస్‌లో లంచం తీసుకుంటుండగా పంయితీ కార్యదర్శి ACBకి రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.