News April 22, 2025
హత్యకు గురైన వడ్డీ వ్యాపారి: రాంబిల్లి సీఐ

రాంబిల్లి మండలం చినకలవలాపల్లి గ్రామంలో వడ్డీ వ్యాపారి జల్లి తాతారావు (65) హత్యకు గురయ్యాడు. ఈనెల 20 తేదీ రాత్రి మెడపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రాంబిల్లి సీఐ నర్సింగరావు సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యులు రాజమండ్రిలో ఉంటున్నారు. కుమారుడు అప్పలరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News April 22, 2025
ఇబ్బందులు ఉంటే రైతులు తెలపాలి: జేసీ

ఉండి మండలం యండగండి గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. రైతు సేవ కేంద్రం ద్వారా కొనుగోలు సక్రమంగా జరుగుతుందా, అధికారులు మీకు సహకరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు తెలపాలన్నారు. రైతులతో కలిసి తేమ శాతం పరిశీలించారు.
News April 22, 2025
అచ్చంపేట: స్టేట్ ర్యాంక్ సాధించిన ప్రభుత్వ కళాశాల విద్యార్థిని

పట్టణానికి చెందిన పిట్టల దశరథం, జ్యోతిల కుమార్తె పిట్టల స్నేహిత ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో 1000 మార్కులకు గాను 990 మార్కులతో.. స్టేట్ ర్యాంక్ సాధించి శభాష్ అనిపించుకుంది. నిరుపేద కుటుంబానికి చెందిన స్నేహిత భవిష్యత్‌లో ఇంజినీర్‌గా ఎదగాలి అనేది తన కోరిక అని తెలిపింది. ఆమెను కాలేజీ సిబ్బంది అభినందించారు.
News April 22, 2025
BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.