News April 4, 2025
హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు

విజయనగరం జిల్లా కొత్తవలస పోలీస్ స్టేషన్లో 2022లో నమోదైన హత్య కేసులో నిందితుడు జోడి నూకరాజుకు జీవిత ఖైదు, రూ.1000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని SP వకుల్ జిందాల్ గురువారం తెలిపారు. అప్పన్నదొర పాలెం పంచాయతీ జోడుమెరక గ్రామానికి చెందిన నూకరాజు తన భార్యను చంపి కనిపించట్లేదని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కోర్టులో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందన్నారు.
Similar News
News December 9, 2025
పశుసంపద బలోపేతమే లక్ష్యం: కలెక్టర్

పశు సంపద రంగాన్ని బలోపేతం చేయటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ కృత్తికా శుక్ల అన్నారు. గొర్రెల పెంపకందారులను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొస్తున్న క్లైమేట్ రెసిలియంట్ ఇంటిగ్రేటెడ్ షీప్ హోస్టెల్స్ (CRISH) ప్రాజెక్టు అమలుపై కలెక్టరేట్లో ఆమె మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టు అమలును వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
News December 9, 2025
VZM: ‘వచ్చే ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి’

రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఇళ్ల నిర్మాణం పురోగతిని పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్ బాబు మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. గొల్లలపేట (PMAY-1.0)లో నిర్మిస్తున్న 106 ఇళ్లను సందర్శించి, లబ్ధిదారుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ ఇళ్లను ఉగాది 2026 నాటికి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
News December 9, 2025
అనకాపల్లి: ‘పది, ఇంటర్ పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి’

జిల్లాలో ఈ ఏడాది పది, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు కృషి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. అనకాపల్లి కలెక్టరేట్ నుంచి మంగళవారం సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు 100 రోజుల కార్యాచరణ అమలు చేయాలన్నారు. ఇంటికి వెళ్లిన వసతి గృహాలకు చెందిన విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకురావాలన్నారు.


