News September 28, 2024

హత్యాయత్నం కేసులో.. కడప జైలు వార్డెన్‌కు రిమాండ్

image

అత్తను హత్య చేసేందుకు ప్రయత్నించిన కడప సెంట్రల్ జైలు వార్డెన్ మహేశ్‌కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని తుళ్లూరు సీఐ వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కాకినాడకు చెందిన హైకోర్టు ఉద్యోగి భువనేశ్వరికి మహేశ్‌తో ఏప్రిల్‌లో పెళ్లి కాగా.. వీరు గుంటూరు జిల్లా రాయపూడిలో అద్దెకుంటున్నారు. ఆగస్టు 22న మహశ్ తన అత్త సాయికుమారిపై దాడిచేసి, హత్య చేసేందుకు ప్రయత్నించాడన్నారు.

Similar News

News November 28, 2025

అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

image

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

News November 28, 2025

కడప: రైతు కంట నీరు.. నష్టం నమోదుకు అడ్డంకులు

image

జిల్లాలో నాలుగు రోజుల కింట కురిసిన వర్షాలకు వరి పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు అంటున్నారు. చేలల్లోనే ధాన్యం తడిసి మొలకెత్తుతుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాన్ని అధికారులు నమోదు చేయడం లేదని వాపోతున్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు నమోదు చేసేందుకు ప్రభుత్వం ఇంకా తమకు లాగిన్ ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారంటున్నారు. ప్రభుత్వం స్పందించి నష్ట పరిహారాన్ని అందించాలని కోరుతున్నారు.

News November 28, 2025

కడప: హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరు..?

image

జిల్లాలో వెలుగులోకొచ్చిన రూ.కోట్ల విలువైన హౌసింగ్ స్కాంలో కాంట్రాక్టర్లను కాపాడుతోంది ఎవరని ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లు పేజ్-3 కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ స్కాంలో ఇప్పటి వరకు ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుని జీతాలు నిలిపేశారు. సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులకు ఆదేశించారు. ఐతే రూ.కోట్లు కొల్లగొట్టిన కాంట్రాక్టర్లపై మాత్రం చర్యలు లేవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.