News September 13, 2024
హత్యాయత్నం కేసులో 18 ఏళ్లు జైలు శిక్ష

కాకినాడలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చిన్నారావుపై హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ముద్దాయి దుర్గాప్రసాద్ కు 18 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కాకినాడ రెండవ అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ విజయబాబు గురువారం తీర్పు చెప్పారు. 2023 మార్చి 17వ తేదీన హత్యాయత్నానికి పాల్పడ్డా ఘటనలో అప్పట్లో కేసు నమోదు చేశారు. కేసులో నేరం రుజువు కావడంతో జడ్జ్ శిక్ష విధించారని సీఐ అప్పలనాయుడు తెలిపారు.
Similar News
News November 6, 2025
ధాన్యం సేకరణ సందేహాలపై కంట్రోల్ రూమ్: కలెక్టర్

ఖరీఫ్ సీజన్లో వరి సేకరణ 4 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటి వరకు రైతుల నుంచి మొత్తం15.64 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు సంయుక్త కలెక్టర్ వై. మేఘ స్వరూప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధాన్యం కొనుగోలుపై సందేహాలకు, ఫిర్యాదులకు కలెక్టర్ కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్ నంబర్ 83094 87151కు సంప్రదించవచ్చన్నారు.
News November 6, 2025
రాజమండ్రి: ఈనెల 7 జాబ్ మేళా

రాజమండ్రి మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈనెల 7 శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె.హరీశ్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో బీఓబీ, ఎస్బీఐ పేమెంట్స్, భరత్ పే వంటి పలు సంస్థలలోని ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. 10వ తరగతి నుంచి డిగ్రీ పూర్తిచేసిన, 19 నుంచి 30 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు అర్హులని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
News November 5, 2025
రాజమండ్రి: పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు ఆహ్వానం

జిల్లాలో పర్యాటక అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పి. వెంకట చలం బుధవారం ప్రకటించారు. జలక్రీడలు, సాహస క్రీడలు, లగ్జరీ హౌస్ బోట్లు, పార్టీ బోట్ల వంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి గల వారు www.tourism.ap.gov.in వెబ్సైట్లో వివరాలు చూడవచ్చని, లేదా 9505011951 / 6309942025 నంబర్లలో సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.


