News July 25, 2024
హత్యాయత్నం కేసు విచారణ చేపట్టిన DSP

పీలేరు మండలం, కావలిపల్లె పంచాయతీ, ఒంటిల్లులో టీడీపీ నేత గిరి నాయుడుపై జరిగిన హత్యాప్రయత్నంపై డీఎస్పీ రామచంద్ర రావు విచారణ చేపట్టారు. హత్యాయత్నం ఘటన జరిగిన ఇంటిని డీఎస్పీ, పీలేరు సీఐ మోహన్ రెడ్డి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించారు. దుండగులు మాస్కులు, గ్లౌజులు తొడిగి ఉన్నట్లు బాధితుడు పోలీసులకు చెప్పారు. నిందితులతో తాను ప్రతిఘటించానని, వారు తమ ద్విచక్ర వాహనాల్లో పరారీ అయ్యారన్నారు.
Similar News
News December 21, 2025
చిత్తూరు: ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు

పీఎం ఆవాస యోజనలో భాగంగా పక్కా గృహాల నిర్మాణానికి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలో 6,485, చిత్తూరులో 1,628, నగరిలో 2,331, పూతలపట్టులో 5,035, జీడీ నెల్లూరులో 5,930, కుప్పంలో 13,657, పలమనేరులో 15,391 దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు చెప్పారు. ఇందులో సుమారు 8వేల మంది ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయాలని కోరారు.
News December 21, 2025
రేపే చిత్తూరులో లీప్ టీచర్స్ టోర్నీ

చిత్తూరు మోసానికల్ మైదానంలో ఈనెల 22న లీప్ టీచర్స్ టోర్నమెంట్ నిర్వహిస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ బాబు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీల్లో పురుషుల విభాగంలో పలమనేరు, చిత్తూరు, కుప్పం, నగరి, త్రోబాల్ మహిళా విభాగంలో కుప్పం, నగరి, పలమనేరు, చిత్తూరు జట్లు పాల్గొంటాయని చెప్పారు.
News December 21, 2025
చిత్తూరు మామిడి రైతులకు ముఖ్య గమనిక

మామిడి రైతులకు డిసెంబర్ నెల కీలకమని చంద్రగిరి HO అధికారిణి శైలజ అన్నారు. పూతదశకు ముందు నీటి తడులు ఆపితే చెట్టు ఒత్తిడికి లోనై మంచి పూత వస్తుందన్నారు. పిండి పురుగు పైకి ఎక్కకుండా కాండం చుట్టూ 25 సెం.మీ ప్లాస్టిక్ కవర్ కట్టి గ్రీజు రాయాలని, పూత సమంగా రావడానికి 13-0-45 నిష్పత్తిలో పొటాషియం నైట్రేట్ లీటరు నీటికి 10 గ్రా.కలిపి పిచికారీ చేయాలన్నారు. పాదుల్లో కలుపు తీసి,ఎండిన కొమ్మలు కత్తిరించాలన్నారు.


