News August 21, 2024
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
వైఎస్ఆర్ జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండేళ్ల క్రితం హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధించారు. 2022వ సంవత్సరంలో కొండపేట గ్రామంలో కసువ జ్యోతి అనే మహిళను వివాహేతర సంబంధంతో నాగరాజు అనే వ్యక్తి దిండుతో నులిమి హతమార్చాడు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన న్యాయస్థానం 6వ అదనపు జడ్జి నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించినట్లు సీఐ పురుషోత్తం రాజు తెలిపారు.
Similar News
News September 16, 2024
చాపాడు: ఢివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం
మైదుకూరు – పొద్దుటూరు ప్రధాన రహదారిలో డివైడర్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందాడు. చాపాడు మండలం విశ్వనాథపురం వద్ద రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలిపారు. పొద్దుటూరు నుంచి మైదుకూరుకి వస్తున్న రహదారిపై వేసిన స్పీడ్ బ్రేకర్ గుర్తించలేక స్కూటీ బోల్తా పడి మరణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 16, 2024
కడప: గంగమ్మ ఒడికి చేరుకున్న గణనాథులు
చిన్నమండెం మండల వ్యాప్తంగా భక్తుల నుంచి విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా గ్రామాల్లో మధ్యాహ్నం నుంచి కోలాహలం మొదలైంది. వాడవాడలా కొలువుదీరిన వినాయక విగ్రహాలు డప్పులు, మేళతాళాలు, బాజా భజంత్రీలు, బాణసంచా పేలుళ్ల నడుమ బారులు తీరిన భక్తులు గణనాథునికి నీరాజనాలర్పించారు.
News September 16, 2024
పోరుమామిళ్ల మండలంలో వ్యక్తి సూసైడ్
పోరుమామిళ్ల మండలం ఈదులపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈదుళ్ళపళ్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే వ్యక్తి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఉరివేసుకొని మృతి చెందాడు. మృతుడు స్థానికంగా ఉండే పెట్రోల్ బంకులో పంపు ఆపరేటర్‌గా పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు పరిశీలించి, ఇది హత్యా ఆత్మహత్యా అన్న కోనంలో దర్యాప్తు చేస్తున్నారు.