News April 14, 2025
హత్య కేసులో నిందితులు పోలవరం వాసులు

కొవ్వూరు (M) దొమ్మేరు పుంతలో జరిగిన హత్య కేసులో నిందితుడు పోలవరం (M) పాత పట్టిసీమకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు వెల్లడించారు. హత్యకు గురైన పెండ్యాల ప్రభాకర్‌రావు వద్ద శ్రీనివాస్ 2024లో రూ.2.4లక్షల అప్పు తీసుకున్నాడు. ప్రభాకర్ డబ్బులు అడగడంతో విలాసాలకు అలవాటు పడ్డ శ్రీనివాస్ పోలవరానికి చెందిన ప్రవీణ్‌తో కలిసి హత్య చేశారు. కుడి చేతికున్న బంగారం కోసం చేతి మణికట్టును కూడా నరికేశారు.
Similar News
News January 25, 2026
కాకినాడ: పవన్ కళ్యాణ్ కొడుకుపై AI వీడియో.. HYD వ్యక్తి అరెస్ట్!

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్‌పై AIతో తప్పుడు వీడియో రూపొందించిన వ్యక్తిని సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ బి.పెద్దిరాజు కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన వెంకటరమణ AIతో వీడియోలు చేస్తున్నాడు. అనుమతి లేకుండా అకీరానందన్‌పై ‘లవ్ స్టోరీ’ పేరుతో వీడియోను సృష్టించి యూట్యూబ్‌లో విడుదల చేశాడు. జనసేన నేత తాటికాయల వీరబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News January 25, 2026
నంద్యాల జిల్లాలో నేటి చికెన్ ధరలు

నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. నంద్యాల, జూపాడుబంగ్లా, గడివేముల, బనగానపల్లె, డోన్, బేతంచెర్ల, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల తదితర మండలాల్లో లైవ్ కిలో రూ.195, స్కిన్ రూ.220, స్కిన్‌లెస్ రూ.240-280 చొప్పున విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800-900, చేపలు రూ.180కి అమ్ముతున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.
News January 25, 2026
నరసరావుపేటలో కేజీ చికెన్ ధర ఎంతంటే.!

నరసరావుపేటలో ఆదివారం నాన్‌వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ స్వల్పంగా ఆరు రూపాయలు తగ్గి రూ. 160గా ఉంది. చికెన్ కేజీ స్కిన్ లెస్ రూ. 280 నుంచి రూ.300, స్కిన్ రూ. 250 నుంచి రూ. 260కి విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ. 900 నుంచి రూ. 1000కి అమ్ముతున్నారు. 100 కోడి గుడ్లు 505 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి. మరి మీ ప్రాంతంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేయండి.


