News July 25, 2024
హత్య కేసు నిందితులకు గ్రామ బహిష్కరణ

చెన్నెకొత్తపల్లి మండలంలోని వెల్దుర్తి గ్రామస్థులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20తేదీన ధర్మవరం మండల పరిధిలోని సీసీ కొత్తకోట వద్ద సూర్యనారాయణ అనే వ్యక్తిని సమీప బంధువులు ఆస్తి తగదాల కారణంగా హత్య చేశారు. గ్రామ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని హత్యకు కారకులైన వారిని గ్రామ బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ఎస్సై వెంకటేశ్వర్లు స్థానికులతో చర్చించారు.
Similar News
News October 22, 2025
ఎర్రచందనం అనుకొని తనిఖీలు.. తీరా చూస్తే సండ్ర మొద్దులు..!

యాడికి మండలం మీదుగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కొలిమిగుండ్ల నుంచి బుగ్గ మీదుగా యాడికికి వస్తున్న ఐచర్ వాహనాన్ని సీఐ ఈరన్న తన సిబ్బంది నిలిసి తనిఖీ చేవారు. అయితే అవి సండ్ర మొద్దులు అని గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వాటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది.
News October 22, 2025
ALL THE BEST

బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు హెచ్ఎం నీరజ తెలిపారు. చంద్రగిరిలో జరిగే అండర్-14 విభాగంలో బిందు, నందు, లక్ష్మి, కడపలో జరిగే అండర్-17 విభాగంలో జగదీశ్వరి ఎంపికయ్యారు. క్రీడాకారులను పీడీ గట్టు నాగరాజు, ఉపాధ్యాయులు నాగేంద్ర ప్రసాద్, కోటేశ్వరప్ప, బాలకృష్ణ, ఉమ, లలిత, వెంకటలక్ష్మి, మధుమాల, కమల, సువర్ణ అభినందించారు.
News October 22, 2025
సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలి: కలెక్టర్

సోలార్ ప్రాజెక్టు కోసం భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో సోలార్ ప్రాజెక్టు కోసం భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కంబదూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్రాజెక్టు కోసం 4,292.28 ఎకరాలు గుర్తించామని, పెండింగ్లో ఉన్న 984.53 ఎకరాల భూముల గుర్తింపు సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.