News July 11, 2024
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి

భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఇల్లూరుకు చెందిన ఎర్రిస్వామి, సువర్ణ(26) దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న అనుమానంతో భార్య గొడవపడేది. నిన్న ఇద్దరూ గొడవపడగా భర్త భార్యను కొట్టడంతో ఆమె మృతిచెందింది. ఆ తర్వాత ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 25, 2025
డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
News October 24, 2025
రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో రోడ్డు భద్రత కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్తో కలిసి నిర్వహించారు. రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. గుత్తి -గుంతకల్లు రోడ్లోని రోడ్ & ఆర్ఓబీని, రాప్తాడు వద్ద రైల్వేలైన్ ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలన్నారు.
News October 24, 2025
జేసీ వ్యాఖ్యలను ఖండించిన అనంతపురం రేంజ్ డీఐజీ

తాడిపత్రి ASP రోహిత్ కుమార్ చౌదరిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం రేంజ్ DIG షేమోషీ తీవ్రంగా ఖండించారు. గురువారం తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ వారికి దేశ సేవ చేయడమే ప్రధాన ధ్యేయం అన్నారు. తమకు కులం, మతం, ప్రాంతం తేడా ఉండదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని అవమానకర భాషలో సంభోదించడం పరిపాలనా ప్రమాణాలకు విరుద్ధం అన్నారు.


