News January 26, 2025
‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.
Similar News
News November 8, 2025
బుమ్రా కాదు.. వాళ్లిద్దరే డేంజర్: అశ్విన్

టీ20 ఫార్మాట్లో బుమ్రా కన్నా వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ ప్రమాదమని టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. ‘భారత్లో జరగబోయే T20 WCను గెలవాలనుకుంటే వాళ్లు చక్రవర్తి, అభిషేక్ శర్మ రూపంలోని అడ్డంకులను దాటాల్సిందే. వీరి కోసం ప్రత్యేక వ్యూహాలు రెడీ చేసుకుంటేనే ప్రత్యర్థులు గెలవగలరు. ఆసీస్ అభిషేక్ కోసం వాడుతున్న షార్ట్ బాల్ స్ట్రాటజీ బాగుంది. WCలోనూ వాళ్లు ఇదే వాడొచ్చు’ అని తెలిపారు.
News November 8, 2025
రామారెడ్డి: లోన్ పేరుతో మోసం.. రూ.1.02 లక్షల టోకరా!

ఆన్లైన్ మోసంలో ఓ వ్యక్తి చిక్కుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. SI రాజశేఖర్ వివరాలిలా..రామారెడ్డి (M) రెడ్డిపేట వాసి రాజు చరవాణికి వచ్చిన ముద్ర లోన్ ప్రకటన చూసి తన వివరాలు నమోదు చేయగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో బాధితుడి నుంచి 7 విడతలుగా రూ. 1,02,960 బదిలీ చేయించుకున్నాడు. మోస పోయినట్లు తెలిసి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు SI వివరించారు.
News November 8, 2025
అసోసియేషన్ల తీరుతో నష్టపోతున్న క్రీడాకారులు!

AP: ఇటీవల DSCలో స్పోర్ట్స్ కోటా కింద కొందరు ఉద్యోగానికి అనర్హులయ్యారు. గుర్తింపులేని అసోసియేషన్లతోనే క్రీడాకారులు నష్టపోతున్నారని శాప్ తెలిపింది. APలో మొత్తం 63 స్పోర్ట్స్ అసోసియేషన్లు ఉండగా.. అందులో శాప్ గుర్తించినవి 35 మాత్రమే. గుర్తింపులేని వాటి తరఫున సర్టిఫికెట్లు సాధించినా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఈ విషయం ముందే తెలుసుకుని గుర్తింపులేని అసోసియేషన్ల తరఫున ఆడొద్దని సూచిస్తున్నారు.


